UFO: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తుతెలియని వస్తువు కలకలం.. రంగంలోకి రఫేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UFO: ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కలకలం సృష్టించింది. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో ‘అజ్ఞాత ఎగిరే వస్తువు’ (UFO) కనిపించిందని సమాచారం అందుకున్న భారత వైమానిక దళం రెండు రాఫెల్ ఫైటర్ జెట్‌లను రంగంలోకి దించింది. హసిమారా వైమానిక స్థావరం నుంచి ప్రయోగించిన రఫేల్‌లు యుద్ధ విమానాలు దేనిని గుర్తించలేకపోయాయని ఉన్నత వర్గాలు తెలిపాయి. మొదటి విమానం స్థావరానికి తిరిగి వచ్చింది. రెండవది మళ్లీ తనిఖీ చేయడానికి ప్రాంతం వైపు మోహరించబడింది, కానీ అది దేనినీ నిర్ధారించలేకపోయింది. ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది.
Also Read: Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
“ఇంఫాల్ విమానాశ్రయం నుంచి విజువల్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఐఏఎఫ్ దాని ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసింది. ఆ తర్వాత చిన్న వస్తువు కనిపించలేదు” అని ఆదివారం ట్వీట్ చేసింది. “సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్‌ఫీల్డ్ పశ్చిమం వైపు కదులుతున్న గుర్తు తెలియన వస్తువు ఒకటి ఎగురుతూ కనిపించింది” అని CISF అధికారి ఒకరు తెలిపారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన గుర్తుతెలియని ఎగిరే వస్తువు కనిపించడంతో కొన్ని గంటలపాటు విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
దారి మళ్లించబడిన విమానాలలో కోల్‌కతా నుండి ఇండిగో విమానం కూడా ఉంది. 25 నిమిషాల తర్వాత గౌహతికి మళ్లించారు.ఆలస్యమైన విమానాలు దాదాపు మూడు గంటల తర్వాత క్లియరెన్స్ పొందిన తర్వాత ఇంఫాల్ విమానాశ్రయం నుంచి బయలుదేరాయి. షిల్లాంగ్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్‌కు కూడా ఈ పరిణామం గురించి సమాచారం అందించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!