ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి ప్రజాభవన్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మనం ఇళ్లకే పరిమితమై ఉంటాం. మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడానికి, చలి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం చాలా మంది బయటకు వెళ్లరు. బయటకి వెళ్లకపోవడం వల్ల మనపై సూర్యరశ్మి చాలా తక్కువగా పడుతుంది. ఇది కాకుండా, సూర్యరశ్మిని నివారించే సంస్కృతి కూడా మన మనస్సులలో లోతుగా పాతుకుపోయింది.
వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో బేరాలు చేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయటం పేర్ని నానికి అలవాటు అని ఆయన ఆరోపించారు.
రెండు ఓట్ల వివాదంలో జనసేన నేత నాగబాబు చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణలో నాగబాబు కుటుంబం ఓటు వేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇటీవల నాగబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అభివృద్ధి కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంతి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తుఫాన్ వచ్చినా ప్రాణ నష్టం జరగలేదన్నారు.
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలు ఇలా ఉన్నాయి.