ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
ఏపీలో వైసీపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు సీట్లపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సెకండ్ ఫేజ్ మార్పుల కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు. ఒకటి, రెండు రోజుల్లో కొత్త సమన్వయకర్తలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
సోమవారం లడఖ్‌లోని కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని కనులారా దర్శించుకొసే అదృష్టం.. ప్రార్థించే అవకాశం కోసం కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం.. టీటీడీ అనేక రకాల చర్యలు చేపడుతోంది.
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ వై నాట్ 175 నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదుపై తన సీల్డ్ సైంటిఫిక్ సర్వే నివేదికను సమర్పించింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు గత వారం ఏఎస్‌ఐకి కోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది.
ఇక నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది ఏపీ సర్కారు. రేపటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. రేపు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా సీఎం వైయస్.జగన్ ప్రారంభించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్‌ను ఎదుర్కోవటానికి ఒక టీడీపీ, ఒక చంద్రబాబు సరిపోరట.. అందుకే ఈ పొత్తులు నిర్ణయం అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.