టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతర వాస్తవాలను పసిగట్టిన కాంగ్రెస్ ఇప్పుడు సీట్ల పంపకాల ప్రక్రియను వేగవంతం చేసే విషయంలో అనువైన వైఖరిని అవలంబించాలని సూచిస్తోంది. డిసెంబర్ 19న జరిగే సమావేశంలో ఇండియా కూటమి నేతల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై విస్తృత ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది.
నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా ప్రజలు ఊబకాయులుగా మారుతున్నారు. తరచుగా సరైన సమయంలో తినడం, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయకపోవడం వంటివి ఊబకాయానికి ప్రధాన కారణాలు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు ఏం చేసుకుంటాడంటూ ఎద్దేవా చేశారు.
తన పార్ట్‌నర్‌కు మైనింగ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ఆయనకు అండగా ఉండాలని భావించి సోమిరెడ్డి నిరసన చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఫండ్ అవసరమని భావించే భాగస్థుడి కోసం హడావిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఏలూరులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉపాధ్యాయ ఉద్యమ నేత, శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ అంతిమయాత్ర ఆదివారం ఏలూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలూరుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు సాబ్జీకి నివాళులర్పించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ మూర్తిని సస్పండ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో కానిస్టేబుల్ మూర్తి తలదూర్చడమే సస్పెండ్‌కు కారణమని తెలిసింది.