విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు జరుగుతున్న తీరును మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనుల కోసం రూ. 5వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఏపీలోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కర్నూల్ నగరంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందగిన విజయ్, రుక్సానాలుగా గుర్తించారు.
ఎస్సై పోస్టుల నియామకంలో అన్యాయం జరిగిందని తప్పు పిటిషన్ దాఖలు వేసిన పిటిషనర్లపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ప్రభుత్వ ఆసుపత్రిని శుభ్రం చేసి సామాజిక సేవ చేసేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షేక్ సాబ్జీ మరణం ప్రమాదం కాదు, హత్య అంటూ ఆయన కొడుకు, సోదరుడు ఆరోపిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులను అందినకాడికి దోచుకున్న నేరగాళ్లు.. తాజాగా మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. విశాఖలో సైబర్ నేరగాళ్లు మైనర్ బాలికలను టార్గెట్ చేశారు. ఆరుగురు కేంద్రీయ విద్యాలయం విద్యార్థినుల అదృశ్యం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి బాలికలను సురక్షితంగా రక్షించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బృందావన అపార్ట్‌మెంట్ సమీపంలో గల పార్కులో ఏర్పాటుచేసిన 'ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలి' కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులకు ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకి, కోడెల శివప్రాసాద్ నరసరావుపేట నుండి సత్తెనపల్లికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తుఫాన్ , కరువులపై పరిశీలన చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాలు భేటీ అయ్యాయి. సీఎంతో తుఫాన్, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు అధికారుల బృందాలు సమావేశమై.. క్షేత్ర స్థాయిలో తాము గుర్తించిన అంశాలపై చర్చించారు.