Minister Kakani Govardhan Reddy: అభివృద్ధి కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంతి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తుఫాన్ వచ్చినా ప్రాణ నష్టం జరగలేదన్నారు. నాబార్డు నుంచి నిధులు త్వరలోనే విడుదల అవుతాయని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఇచ్చే నిధులను రూ.25 లక్షలకు ముఖ్యమంత్రి జగన్ పెంచారన్నారు.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు, లోకేష్‌లు సింగిల్‌గా పోటీ చేయగలరా?.. అంబటి సవాల్
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తున్నామని.. ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచామని మంత్రి తెలిపారు. వైద్యులే ఇంటికి వెళ్ళి చికిత్స చేసి ప్రజలకు మందులు ఉచితంగా ఇస్తున్నారన్నారు. జనవరి నుంచి 3 వేల రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. జగన్ ఇచ్చిన ప్రతీ హమీని అమలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.