Kollu Ravindra: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో బేరాలు చేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయటం పేర్ని నానికి అలవాటు అని ఆయన ఆరోపించారు. కొవిడ్‌ను వ్యాపారంగా మార్చిన వ్యక్తి, రెమిడీసీవర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో అమ్ముకున్న వ్యక్తి పేర్ని నాని అంటూ ఆయన ఆరోపణలు చేశారు.
Read Also: Janasena: రెండు ఓట్ల వివాదంలో నాగబాబు.. తెలంగాణలో ఓటేసి, ఏపీలో మళ్లీ వేస్తారా?
ఫేక్ స్కానింగ్ సెంటర్‌లను పెట్టించి కమిషన్లను దండుకున్నది పేర్ని కుటుంబం కాదా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తుఫాన్‌లో దెబ్బతిన్న రైతులకు ఏం చేశారు అంటే ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తుఫాన్ నష్టం గురించి చెప్పమంటే కొవిడ్ గురించి నాని మాట్లాడుతున్నాడని.. ఆక్సిజన్ సప్లై లేక కొవిడ్‌లో ఎంతమంది చనిపోయారో వస్తే చూపిస్తామన్నారు. టీడీపీ వాళ్లు ఎంత సర్వీస్ చేశారో చూపిస్తాం, నాపై కూడా కేసులు కూడా పెట్టారమన్నారు.