Nagababu: నెల్లూరులో జనసేన నియోజకవర్గ సమీక్ష సమావేశాలు తొలిరోజు ముగిశాయి. ఏడు నియోజకవర్గాల నేతలతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన జనసైనికులకు పలు సూచనలు చేశారు. జన సైనికులు మరింత బాధ్యతగా ఎన్నికల్లో పనిచేయాలని నాగబాబు తెలిపారు.
Read Also: Sunlight Benefits: సూర్యరశ్మి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
జనసేన.. టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేద్దామని ఆయన జనసేన నేతలతో అన్నారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను పక్కన పెట్టాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన ఐక్యతను కాపాడుదామని సూచించారు. చిన్న చిన్న సమస్యలు పార్టీల్లో సర్వసాధారణమని, జన సైనికులకు అధిష్టానం అండగా ఉంటుందన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేన నేతలందరూ పనిచేయాలని నాగబాబు స్పష్టం చేశారు.