రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ తమ భారతీయ మీడియా కార్యకలాపాలను విలీనం చేయబోతున్నాయని ఒక నివేదిక తెలిపింది. ఈ విలీనం వల్ల షేర్లు, నగదు ద్వారా రిలయన్స్ 51 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉంటుందని, మిగిలిన 49 శాతం డిస్నీ కలిగి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది.
పెరుగుతున్న కొవిడ్-19 కేసులను చూస్తుంటే, పండుగల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొవిడ్ కొత్త రూపాంతరం, JN.1 కారణంగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. అంతే కాకుండా చలికాలంలో ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
విశాఖపట్నం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. ఏకంగా 1.4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ ధరతో పోలిస్తే.. తక్కువ ధరకు లభిస్తున్న దేశీయ బొగ్గు లభిస్తుండడంతో విదేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బొగ్గు ధరలలో వ్యత్యాసం కారణంగా కొనుగోళ్లు ఆగిపోయాయి.
హార్మోన్లు మన శరీరం యొక్క రసాయన దూతలు. ఇవి శరీరంలోని ప్రతి అవయవానికి సందేశాలను అందించడానికి పని చేస్తాయి. హార్మోన్ల సహాయంతో ఎప్పుడు, ఎలా పని చేయాలో సంకేతాలు శరీర భాగాలకు చేరుతాయి. కాబట్టి మన శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉండటం అవసరం.
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ గాంధీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలో కూడా పుంజుకుని పూర్వవైభవం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.