Nellore: నెల్లూరులోని జాకీర్ హుస్సేన్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫరీద్ (14)అనే బాలుడిని ఫరహాన్ (16) అనే మరో బాలుడు కొట్టి చంపేశాడు.గొంతు, గుoడెపై కొట్టడంతో అక్కడికక్కడే ఫరీద్ కుప్పకూలిపోయినట్లు తెలిసింది.
క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదమే ఈ ఘర్షణకు కారణమని.. ఆ ఆవేశంలో ఫరీద్‌ను మరో బాలుడు గొంతు గుండెపై కొట్టడంతో అక్కడికక్కడే కూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఫరీద్‌ను చికిత్స కోసం ఆదుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఫరీద్ స్థానిక ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.