సీట్ల మార్పుపై ముఖ్యమంత్రి జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.జగన్ తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన ఫీలింగ్గే ఇప్పుడు ఎమ్మెల్యేలలో వుందన్నారు.
గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 1200 మంది నాటక రంగ కళాకారులు హాజరయ్యారు. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే నాటక రంగం మళ్ళీ పునర్జీవం పోసుకుంటుందని, నాటకాలు ఆడుకునేందుకు ఓపెన్ ఆడిటోరియాలు నిర్మించాలని కళా పరిషత్ నిర్వాహకులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థుల ఖరారును వేగవంతం చేశారు. తాజాగా అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు చేస్తోంది.
ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశమైంది. తొలి రోజున 18 జిల్లాల సమీక్ష జరగగా.. ఇవాళ 8 జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నెలలోనే ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) చీఫ్‌గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌ను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 జనవరి 6న భూమికి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) గమ్యస్థానానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
తిరుమలలో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. శనివారం వేకువజామున 1.30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తం శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు.