షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి అలవాటు పడ్డారని.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె ఇష్టమన్నారు. చంద్రబాబు రా కదలి రా అని సభ పెట్టారని.. ఎవరు కదలి రావాలి? ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు.
సోమాలియా తీరంలో హైజాక్ చేయబడిన ఎంవీ లీలా నార్‌ఫోక్ అనే నౌకలోని 15 మంది భారతీయులతో సహా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. వారందరిని భారత నేవీ కమాండోలు కాపాడారు. హైజాక్‌కు గురైన సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అందులోని సిబ్బందిని రక్షించారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిన విషయమే. షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు.
2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా తలపడనుంది. ఈసారి ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తున్నాయి.
సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతికి ఆర్టీసీ అధికారులు అదనపు ఛార్జీల్లేకుండా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది.
విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
వైసీపీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎంఓలో పార్టీ కీలక నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ లేదని చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ టీనేజీ బాలిక గత మూడు నెలలుగా అన్నంలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులను మోసం చేస్తోంది. తల్లిదండ్రులు మత్తుతో నిద్రపోగానే.. ఆ అమ్మాయి తన ప్రియుడిని ఇంటికి పిలుస్తోంది.
చాలా కాలం తర్వాత ఈమధ్య అండర్ వరల్డ్ డాన్ 'దావూద్ ఇబ్రహీం' పేరు సోషల్ మీడియా లో తెగ వినిపిసుంది. ఆయనపై పాకిస్తాన్ లో విషప్రయోగం జరిగినట్టు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా లో ఉన్న దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తుల గురించి పెద్ద చర్చ నడుస్తుంది.