మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. సీఎంవోకు వచ్చిన నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు.
పొంగల్ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పొంగల్ సందర్భంగా ప్రజలకు రూ.1000 నగదును కానుకగా అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 15న పొంగల్ పండుగ జరుపుకోనున్న సంగతి తెలిసిందే.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌లపై క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది.
బెంగళూరులోని తన నివాసంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి తన తండ్రి లైసెన్స్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గురువారం తెలిపారు.
2024 ఎన్నికలకు ముందు అంటే అధికారం కోసం కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' చేపట్టబోతోంది. కాంగ్రెస్ ఈ యాత్ర 6,700 కి.మీ. కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాల్లో 67 రోజుల పాటు యాత్ర సాగనుంది.
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తమిళనాడులోని వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ, పునరుద్ధరణ, పునరావాస పనులు చేపట్టేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరారు.
ముఖ్యమంత్రి జగన్ మాటే తమకు వేదమని, ఆయన ఆదేశాలు సిరసావహిస్తామని కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. జగన్ హీరోయిజం చూసి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే వెల్లడించారు.
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు.