Pakistan Election: పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఎన్నికలపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చలి వాతావరణం, భద్రతాపరమైన కారణాలతో సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పాకిస్థాన్ పార్లమెంట్ తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికల తేదీని 8 ఫిబ్రవరి 2024గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. నేటి సెషన్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని, ఎన్నికలను ఆలస్యం చేయాలనే తీర్మానాన్ని సెనేట్ ఆమోదించింది. ఈ తీర్మానం రెండుసార్లు సమర్పించబడింది. సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగి గైర్హాజరు కావడంలో తొలిసారి, ఆయన సమక్షంలో రెండోసారి తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండుసార్లు సెనేట్ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించింది.
Read Also: Ganja Seized : కొత్తగూడెంలో భారీగా గంజాయి సీజ్
స్వతంత్ర ఎంపీ దిలావర్ ఖాన్ ఎన్నికలను వాయిదా వేయాలని పార్లమెంటులో ప్రతిపాదనను సమర్పించారు. దీనికి పార్లమెంటు ఎగువ సభలో భారీ మద్దతు లభించింది. పార్లమెంటు ఎగువ సభలో మొత్తం 100 మంది సభ్యులు ఉన్నారు. సెనేట్ సెషన్, సెనేటర్ కహుదా బాబర్ దేశంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి గురించి తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్నికల పోటీదారుల రక్షణను హైలైట్ చేశారు. అయితే, సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఈ చర్యను వ్యతిరేకించారు.
దిలావర్ ఖాన్ ప్రతిపాదనను అందజేస్తూ, ఈ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన చలిని అనుభవిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో చలి ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లు చేయడం కుదరదన్నారు.