Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ టీనేజీ బాలిక గత మూడు నెలలుగా అన్నంలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులను మోసం చేస్తోంది. తల్లిదండ్రులు మత్తుతో నిద్రపోగానే.. ఆ అమ్మాయి తన ప్రియుడిని ఇంటికి పిలుస్తోంది. రాత్రిపూట పలుమార్లు ప్రియుడు ఇంటికి రావడంతో ఇరుగుపొరుగు వారు కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు అనుమానం రావడంతో రాత్రి పూట అన్నం తినకుండా మాటు వేశారు. ప్రియుడు అమ్మాయిని కలిసేందుకు అక్కడిగా రాగా.. చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. ఆమె ప్రియుడిని అక్కడికక్కడే పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన ఘటన గోరఖ్‌పూర్ జిల్లా తివారిపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
Read Also: Dawood Ibrahim: దావూద్ పూర్వీకుల ఆస్తి వేలం.. చిన్న ప్లాట్ రూ.2 కోట్లకు విక్రయం
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. గత మూడు నెలలుగా రాత్రి భోజనం చేసే సమయంలో తల్లిదండ్రులకు నిద్ర మాత్రలు ఇచ్చి వారిని నిద్రపుచ్చేది. యువతి ఆ యువకుడిని రాత్రికి రాత్రే తన ఇంటికి పిలిపించుకునేది. దీంతో స్థానికులకు అనుమానం రావడంతో బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం బుధవారం నాడు మరోసారి తన ప్రియుడికి ఫోన్ చేసిన యువతి, అంతకు ముందు తల్లిదండ్రులకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అయితే ఈసారి కాస్త జాగ్రత్తగా ఉండి కూతురు వడ్డించిన ఆహారం తినకుండా యువకుడి రాక కోసం ఎదురుచూశాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. శబ్ధం విని చుట్టుపక్కల వారు కూడా గుమిగూడారు. యువకుడి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించడంతో వారు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో స్థానికులు ఇరువర్గాలను శాంతింపజేసి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Poonam Kaur: తప్పు చేసి.. ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసు .. పూనమ్ ఫైర్
సమాచారం అందుకే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని తివారీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చెప్పారు. ఈ ఘటన గత మూడు నెలలుగా జరుగుతున్నట్లు విచారణలో తేలింది. ప్లానింగ్ ప్రకారం చాలాసార్లు బాలిక తల్లిదండ్రులకు నిద్రమాత్రలు ఇచ్చి నిద్రపుచ్చి యువకుడిని ఇంటికి పిలిపించేది. బుధవారం కూడా అదే జరగడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వారు భోజనం చేయకుండా.. నిశ్శబ్దంగా దుప్పట్లు కప్పుకుని పడుకున్నట్లు నటించారు. వెంటనే అక్కడికి చేరుకున్న యువకుడిని స్థానికుల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.