మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కార్మిక సంఘాలతో సచివాలయంలోని సెకండ్ బ్లాక్‌లో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్‌గా సమావేశం కానున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత వచ్చింది. కుమార్తె శ్వేతతో పాటు కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఘజియాబాద్ పేరు మార్చే ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. హర్నంది నగర్, గజ్ ప్రస్థ, దూధేశ్వరనాథ్ నగర్ అనే మూడు పేర్లను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పంపనున్నట్లు ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) మేయర్ సునీతా దయాల్ వెల్లడించారు.
Lakshadweep vs Maldives: భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇది విదేశాల కంటే తక్కువ కాదు. ఇక్కడ అనేక అందమైన ద్వీపాలు, బీచ్‌లు ఉన్నాయి. వీటిని చూడటానికి ప్రజలు సుదూర ప్రాంతాలు, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇటీవల అటువంటి అందమైన భారతదేశ ద్వీపం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ స్నార్కెలింగ్ చేస్తూ కనిపించారు. ఆయన పర్యటన అనంతరం లక్షద్వీప్ నిరంతరం ముఖ్యాంశాలలో ఉంది. అదే సమయంలో, […]
గోవాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కసాయి తల్లి తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళుతుండగా.. గోవా పోలీసులు ఆమెను కర్ణాటకలోని చిత్రదుర్గలో అరెస్టు చేశారు.
వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాల్దీవులే. సెలబ్రిటీలు కూడా తరచూ మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి బీచ్‌లు, రిసార్ట్స్‌లో సేద తీరుతుంటారు. ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్‌కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్‌కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్‌గా పెట్టుకుంటుంటారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ద్వారా బీజేపీ జిమ్మిక్కులకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఓ జిమ్మిక్ షో అని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకు గ్రాండ్ రోడ్‌షో నిర్వహించారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.