ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం.
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఏపీలో బీజేపీ నేడు కీలక సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల యోజన భైఠక్ పేరుతో జరిగిన కీలక భేటీలో.. ఎన్నికల్లో పొత్తులు, ఎన్నికల వ్యూహంపై చర్చించారు.
బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అంతమందికి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు.
జమ్ముకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అతడిని అరెస్టు చేసింది.
ఇప్పటి వరకు ఏ ఆసియా జట్టు చేయలేని పనిని భారత జట్టు చేసింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కడంతో పాటు రోహిత్ శర్మ తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది.
మాజీ మోడల్ దివ్య పహుజా హత్యకు గురైన గురుగ్రామ్ హోటల్ నుంచి ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు పంజాబ్‌లోని పాటియాలాలో దొరికింది. కారు లాక్ చేయబడి ఉంది. కారులో దివ్య మృతదేహం ఉందో లేదో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన లక్షద్వీప్ పర్యటన గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఫోటోల్లో ప్రధాని మోడీ విభిన్న స్టైల్స్‌లో కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో రూ.1,156 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఇరాన్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్‌లోని కెర్మాన్‌లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది.
బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని జాతీయ బీసీ అధ్యక్షుడు ,రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. విజయవాడలో బీసీ సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు.
పండుగల సందర్భాల్లో కంపెనీలు ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా ఇస్తేనే ఆ ఉద్యోగులు ఎంతగానో సంబరపడతారు. మరి అలాంటింది ఊహించని గిఫ్ట్ వస్తే.. ఆ ఉద్యోగులు ఎగిరి గెంతేస్తారు కదా! ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఎంజాయ్ చేస్తున్నారు చెన్నైలో ఓ ఐటీ కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు.