జార్ఖండ్‌కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన మూడు దశాబ్దాల మౌనవ్రతాన్ని జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడంతో విరమించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఆమె తన కలగా భావించింది. తన కల నెరవేరేవరకు మౌనవ్రతాన్ని పాటిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది.
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల విద్యా శాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్‌ను మంగళవారం తన కొత్త ప్రధాన మంత్రిగా నియమించారు. దేశ ప్రధాని పోస్టుకు తొలిసారిగా గే (స్వలింగ సంపర్కుడు) వర్గానికి చెందిన 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ పేరును మంగళవారం ప్రతిపాదించారు.
ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ కారణంగా చాలా కాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నివేదిక ప్రకారం, డిసెంబరులో సెరిబ్రల్ అటాక్‌కు గురైన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే మొదట టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో 475 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 6గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
కొత్త ఏడాది వేళ జపాన్‌ను వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోకముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
లక్షదీవులను భారతదేశంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలావుండగా.. మినీకాయ్ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది. ఇది యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాలను కూడా నిర్వహించగలదు.
భారత్, పాక్ దాయాది దేశాల మధ్య శత్రుత్వం గురించి తెలిసిన విషయం. శత్రువు ప్రాణాలతో దొరికితే విజయగర్వంతో ఆ దేశం మీసం తిప్పుతుంది. 2019 ఫిబ్రవరి 27 భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్టుబడిన సమయంలో పాక్‌లో అలాంటి పరిస్థితి లేదు. పాక్ ప్రధానితో సహా ఉన్నతస్థాయి అధికార గణమంతా వణికిపోయారు. రెండు రోజుల్లోనే వర్ధమాన్‌ను విడిచిపెట్టింది పాకిస్థాన్.
ఎమ్మెల్యేలు, ఎంపీలకు ట్రాన్స్ ఫర్‌లు ఉంటాయని తానెప్పుడూ ఊహించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఊరిలో పనికి రాని చెత్త మరో ఊరిలో వేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కనిగిరి బహిరంగ సభలో టీడీపీ అధినేత ప్రసంగించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కాదు...మినీ సూధన్ అంటూ విమర్శించారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 15 రోజుల తర్వాత ఈ మధ్యాహ్నం మంత్రులకు శాఖలను అప్పగించారు. అత్యధికులు తొలిసారిగా మంత్రులుగా పనిచేసినవారే. మంత్రులకు బాధ్యతలు అప్పగించే ముందు బీజేపీ అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడంతో పోర్ట్‌ఫోలియో ప్రకటనకు కొంత సమయం పట్టింది.
వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సాగింది. యాత్ర అనంతరం మల్కిపురం ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు.