Ex-envoy Ajay Bisaria: ఆ అర్ధరాత్రి చిగురుటాకులా వణికిన పాక్.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-envoy Ajay Bisaria: భారత్, పాక్ దాయాది దేశాల మధ్య శత్రుత్వం గురించి తెలిసిన విషయం. శత్రువు ప్రాణాలతో దొరికితే విజయగర్వంతో ఆ దేశం మీసం తిప్పుతుంది. 2019 ఫిబ్రవరి 27 భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్టుబడిన సమయంలో పాక్‌లో అలాంటి పరిస్థితి లేదు. పాక్ ప్రధానితో సహా ఉన్నతస్థాయి అధికార గణమంతా వణికిపోయారు. రెండు రోజుల్లోనే వర్ధమాన్‌ను విడిచిపెట్టింది పాకిస్థాన్. ఆ రోజు పాకిస్థాన్ ఎందుకలా భయపడిందనే విషయాలను ఆ సమయంలో పాక్‌లో భారత హైకమిషనర్‌గా పని చేసిన అజయ్ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు. పాకిస్థాన్‌లో భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా ‘యాంగర్ మేనేజ్‌మెంట్: ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్ షిప్ బిట్‌ఇండియా అండ్ పాకిస్థాన్’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో అజయ్ బిసారియా బాలాకోట్ దాడుల తర్వాత భారత దౌత్య పరిస్థితులకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.
Read Also: Lalit Modi: ఆర్‌సీబీ తరఫున ఆడకుంటే.. కెరీర్ ముగించేస్తానని మోడీ బెదిరించాడు: టీమిండియా మాజీ పేసర్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ బంధించిన అనంతరం భారత్ తీవ్రం స్పందించింది. దాయాదిపైకి 9 క్షిపణులతో దాడికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాక్ తీవ్రంగా భయపడింది. ఆ సమయంలో భారత్‌కు అప్పటి పాక్ హైకమిషనర్ సోహైల్ మహమ్మద్ ఇస్లామాబాద్‌లో ఉన్నారని అజయ్ బిసారియా తన పుస్తకంలో తెలిపారు. “ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. ‘ ప్రధాని మోడీతో ఇమ్రాన్ ఖాన్ ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని చెప్పారు. నేను(అజయ్ బిసారియా) వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారమిచ్చాను. అప్పుడు ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోడీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారు.” అని అజయ్ బిసారియా ఆ పుస్తకంలో వెల్లడించారు.
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడిపించుకునేందుకు క్షిపణులు ఎక్కుపెట్టినట్లు భారత్ ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దానివల్లే అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భయపడిందని అజయ్ తన పుస్తకం వెల్లడించారు. 2019లో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “అభినందన్‌ను పాక్ విడిచిపెట్టి మంచి పని చేసిందని, లేదంటే వారు భయంకరమైన రాత్రి చవిచూడాల్సి వచ్చేది” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!