Music Maestro Rashid Khan: మ్యూజిక్ మ్యాస్ట్రో రషీద్ ఖాన్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Music Maestro Rashid Khan Passes Away: ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ కారణంగా చాలా కాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నివేదిక ప్రకారం, డిసెంబరులో సెరిబ్రల్ అటాక్‌కు గురైన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే మొదట టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తదుపరి దశలో, ఆయన తన చికిత్సను కోల్‌కతాలో ప్రత్యేకంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, గత నెలలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చికిత్సకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం 6 గంటల వరకు ఆయన మృతదేహాన్ని కోల్‌కతాలోని పీర్లెస్ ఆసుపత్రిలో ఉంచనున్నారు. ఆయన భౌతికకాయాన్ని రాత్రికి కోల్‌కతాలోని పీస్ హెవెన్కు పంపనున్నారు. ఆయన అంత్యక్రియలు జనవరి 10న జరగనున్నాయి.
మ్యూజిక్ మ్యాస్ట్రో రషీద్‌ఖాన్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. నివాళులర్పించేందుకు ఆయన భౌతికకాయాన్ని రవీంద్ర సదన్‌లో ఉంచనున్నారు. ఉస్తాద్ రషీద్ ఖాన్‌కు 2022లో పద్మ భూషణ్ అవార్డు లభించింది.
Also Read
- Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
- Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
- Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
- Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
Read Also: Ashika Ranganath: జూనియర్ అనుష్క అనిపించుకోవడం హ్యాపీనే.. నా సామిరంగ భామ ఆషిక రంగనాధ్ ఇంటర్వ్యూ
ఉస్తాద్ రషీద్ ఖాన్ (జననం 1968 జూలై 1) హిందుస్తానీ సంగీత సంప్రదాయంలో భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు. ఆయన రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందినవారు. ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయాత్ హుస్సేన్ ఖాన్ మునిమనవడు. ఆయన సోమఖాన్ను వివాహం చేసుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం, 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఆయనకు భారత ప్రభుత్వం భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను 2022లో కళారంగంలో ప్రదానం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన సంగీత ఉత్సవాలు, కచేరీలలో ఆయన ప్రదర్శనలు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మాస్ట్రోగా ఆయన కీర్తిని మరింత పటిష్టం చేశాయి. ఆయన ‘ఆవోగే జబ్ తుమ్’, ‘ఆజ్ కోయి జోగీ ఆవే’, ‘రిష్టే నాతే’, ‘ఇష్క్ కా రంగ్’ అనేక ఇతర పాటలకు తన సహకారం అందించారు.
భవిష్యత్ తరాలకు హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని అందించి పరిరక్షించడం, ప్రచారం చేయడంలో దోహదపడ్డారు రషీద్ ఖాన్. ఆయన రికార్డింగ్‌లు, ప్రత్యక్ష ప్రదర్శనలు, కళారూపం పట్ల ఆయనకు గల అంకితభావం భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో అత్యంత విశిష్టమైన, గౌరవనీయమైన గాయకులలో ఒకరిగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఔత్సాహిక సంగీత విద్వాంసులు, సంగీత ఔత్సాహికులకు స్ఫూర్తినిచ్చే గొప్ప వారసత్వాన్ని మిగిల్చాయి.
తాజావార్తలు
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!