శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10వ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు దృష్టి సారించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో టీడీపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు అభివృద్ధి చేయడం చేతకాదని.. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
అక్కా చెల్లెమ్మలు మేలు చేసే మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే రక్షణ కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. ఆదాయం లేని అవ్వ, తాతలకు , అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు నెలనెలా పింఛన్ ఇస్తున్నామన్నారు.
ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. తన కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉందని.. వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోందన్నారు. ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న 'మేమంతా సిద్ధం' సభకు.. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ అన్ స్థాపబుల్ అని.. ఎక్కడ చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. టిప్పర్ డ్రైవర్ అని, వేలిముద్ర గాడు అని చంద్రబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శింగనమల అభ్యర్థిని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి.