CM YS Jagan: ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. తన కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉందని.. వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోందన్నారు. ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. పెత్తందార్లను ఓడించడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. మీరు సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ అన్నారు. 58 నెలల పరిపాలనలో జరిగిన మంచిని, మార్పును గమనించమని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నామన్నారు. మీరంతా కూడా ప్రతీ ఇంటికి వెళ్లి ఈ మార్పులు గురించి చెప్పాలని కోరుతున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు జరిగాయన్నారు.
Read Also: Memantha Siddham: ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ సభ.. భారీగా తరలివచ్చిన జనం
డిగ్రీ తర్వాత ఉద్యోగం రావడం లేదని, ఈ చదువుల వల్ల ఉపయోగం లేదని, పట్టాలు చేతికొచ్చినా తమ జీవితం పట్టాలు ఎక్కడం లేదని బాధపడుతున్న యువత గురించి తనకు బాగా తెలుసని.. కాబట్టే విద్యా రంగంలో కనివినీ విధంగా మార్పులు తీసుకొచ్చామన్నారు. మన విద్యా విధానంలో 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేశామన్నారు. పిల్లలు బడిబాట పట్టాలని అమ్మ ఒడి పథకం తీసుకొచ్చామని.. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టటం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. పెద్ద చదువుల కోసం పూర్తి రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామన్నారు. పిల్లల చదువుల గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే పిల్లలు చదువుకోవాలన్నారు. పిల్లల చదువుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా ముఖ్యమంత్రి ప్రజలను ప్రశ్నించారు. ధనికులకు అందే చదువునే పేదలకు కూడా అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
Read Also: NTR : తన భార్యను ఎన్టీఆర్ ఏమని పిలుస్తాడో తెలుసా?.. అస్సలు ఊహించిఉండరు..
ఒక గింజను పండించడంలో ఒక రైతు పాత్ర, ఒక కూలీ పాత్ర తన కళ్లతో తాను చూశానని సీఎం పేర్కొన్నారు. రైతుల ముఖాల్లో సంతోషం, వారి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తేనే వారి బ్రతుకు బాగుంటుందని ఆలోచించే 58 నెలల పాలనలో అడుగులు వేశామన్నారు. మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదని.. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనమే గెలవబోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని సీఎం కోరారు. పేదల సొంతింటి కలను నెరవేర్చామన్న సీఎం జగన్.. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన రూ.3వేల పెన్షన్ ఇస్తున్నామని.. రూ.3వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ ఒక్కటేనన్నారు. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామన్నారు. ఇంత మంచిచేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని కోరుతున్నామన్నారు.