MP Nandigam Suresh: చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. టిప్పర్ డ్రైవర్ అని, వేలిముద్ర గాడు అని చంద్రబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శింగనమల అభ్యర్థిని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వ్యక్తి అసెంబ్లీకి వస్తారని, చంద్ర బాబుకు ఎదురవుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదల పట్ల ఎప్పుడూ చంద్ర బాబుకు ప్రేమ లేదన్నారు. డబ్బులు ఉన్న వాళ్లకే బాబు టికెట్లు ఇచ్చారన్నారు.
Read Also: TDP: అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి
వేలిముద్ర గాళ్లు అని చంద్రబాబు అంటున్నారని ఆయన ఆగ్రహానికి గురయ్యారు చంద్రబాబు నాయుడు డ్రైవర్ ఎందుకు చనిపోయారు ? ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేదంటూ ప్రశ్నించారు. 420 అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చంద్ర బాబు అని వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును పాతాళంలోకి జనం తొక్కుతారన్నారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్.