Srisailam: శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10వ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు దృష్టి సారించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు జరిగే కైంకర్యాలన్నీ ఎలాంటి లోపం లేకుండా పరిపూర్ణంగా జరగాలని ఆదేశించారు. పూజా కార్యక్రామాలన్నీ నిర్దేశిత సమయానికి ప్రారంభించాలని ఆదేశించారు.
Read Also: CM YS Jagan: విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా?
స్థానిక దుకాణాదారులతో, స్థానిక పోలీసులతో ఈవో పెద్దిరాజు సమావేశమయ్యారు. ఉగాది మహోత్సవాలకు కర్ణాటక,మహారాష్ట్ర నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తారని అంచనా వేశారు. దుకాణాదారులు భక్తులతో మర్యాదగా మెలిగి సంయమనం పాటించాలని ఈవో సూచించారు. ధరల పట్టికతో ఎంఆర్పీ ధరలకే వస్తువులను విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. దుకాణాదారులు, హోటల్ నిర్వాహకులు శుచి శుభ్రతలను పాటించాలని ఈవో ఆదేశించారు. ప్రతి దుకాణాదారుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ ప్రసాదరావు ఆదేశాలు జారీ చేశారు.