CM YS Jagan: అక్కా చెల్లెమ్మలు మేలు చేసే మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే రక్షణ కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ సభలో ఆయన ప్రసంగించారు. ఆదాయం లేని అవ్వ, తాతలకు , అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు నెలనెలా పింఛన్ ఇస్తున్నామన్నారు. 66 లక్షల మంది పింఛన్లు ఇస్తున్నామని.. దేశంలో మొదటి సరిగా ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకు రిజర్వేషన్ కల్పించామని సీఎం చెప్పారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకు ఖాతాలు తీసుకొని చంద్రబాబు హయాంలో, తన హయాంలో ఎంత పడిందో చూసుకోవాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే లను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.. మీ అందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Memantha Siddham: ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ సభ.. భారీగా తరలివచ్చిన జనం
రైతు వ్యతిరేక కూటమికి, రైతు సంక్షేమానికి జరుగుతున్న పోరాటం ఇది అని .. 58 నెలల్లో రైతు భరోసా కింద 67, 500 ప్రతి రైతుకు ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో రూ.87 వేల కోట్లు రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఆయన విమర్శించారు. పగటి పూట పంటలకు 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. పంటకు నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగా పరిహారం ఇస్తున్నామన్నారు. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని.. రైతులు భుజం తట్టి అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. వ్యవసాయం దండగ అని చెప్పిన పార్టీలకు మద్దతు ఇస్తారా….రైతు సంక్షేమం కోరిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా అంటూ ఆయన ప్రజలను కోరారు. అణగారిన వర్గాలకు అండగా ఉన్న ప్రభుత్వమని.. 2.7 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.
తన హయాంలో 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పాలని.. బీసీలకు తోకలు కత్తిరిస్తానని చెప్పిన బాబు తోక కత్తిరించాలన్నారు. 30 ఏళ్లుగా బాబు మోసాలు , అన్యాయాలు చేయడమే కనిపిస్తాయని.. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసాలు గుర్తుకు వస్తాయన్నారు. 2014లో చంద్రబాబు దత్తపుత్రుణ్ణి, మోడీని తెచ్చుకున్నారని.. చంద్రబాబు సంతకం పెట్టి, దత్తపుత్రుడు, మోడీ ఫోటోతో మేనిఫెస్టో ఇచ్చారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. 87 వేల కోట్ల పంట రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారని.. ఆడపిల్ల పుడితే రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పి మోసం చేశారని.. ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం వచ్చేవరకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని.. అర్హులైన వారందరికీ 3 సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామని మోసం చేశారని సీఎం జగన్ అన్నారు.
Read Also: CM YS Jagan: విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా?
మళ్లీ ఇప్పుడు మోసం చేసేందుకు చంద్రబాబు దత్తపుత్రుణ్ణి, మోడీని తెచ్చుకున్నారని.. ఈ మోసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు గెలవడమే టార్గెట్ అంటూ సీఎం పేర్కొన్నారు. సింగనమలలో టిప్పర్ డ్రైవర్‌కి వైసీపీ టికెట్ ఇచ్చిందని చంద్రబాబు తూలనాడాడని.. వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అయినా చదువు మాత్రం చంద్రబాబు కంటే ఎక్కువని సీఎం వెల్లడించారు. వైసీపీ పేదలకు టికెట్ ఇస్తే తప్పేంటని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. మడకశిర నియోజకవర్గంలో వైసీపీ టికెట్ ఉపాధి కూలీ లంకప్పకు ఇచ్చామన్నారు. 100 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలకు టికెట్లు ఇచ్చామన్న సీఎం జగన్.. పెత్తందార్లకు, పేదవారికి ఉన్న తేడా గమనించాలన్నారు.