ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ఈ రోజు అంటే మార్చి 29న గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. దీనిని బ్లాక్ ఫ్రైడే అని కూడా అంటారు. అయితే, దీనిని ఒక శుభకార్యంలా కాకుండా.. క్రీస్తు సంతాప దినంగా జరుపుకుంటారు. ఏసుకు శిలువ వేయబడిన మూడు రోజుల తర్వాత పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్‌గా పాటిస్తారు.
ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయపార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేఖ రాశారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని లేఖలో కోరారు.
బీఆర్‌ఎస్ నేతలు పార్టీని వీడుతుండటంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే వారు పవర్ బ్రోకర్లని హరీష్ వ్యాఖ్యానించారు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపోతున్నారని అన్నారు.
బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో కడియం కావ్య తెలిపారు.
ఫోన్ టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా 10గంటల పాటు విచారించిన అనంతరం రాధాకిషన్‌రావును అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఢిల్లీకి 186 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. రియాన్ పరాగ్ అద్భుతమైన ముగింపుతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగలిగింది.