"ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం గురించే విన్నాం.. కానీ ఇప్పుడు అనకాపల్లి గుడ్డు గురించి వింటున్నా.. ఐదు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్ ఇచ్చినా కిలోమీటర్ రోడ్డు కూడా వేయించుకోలేక పోయారు.." అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపమని.. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారని ఆయన ఆరోపించారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోందన్నారు.
చేవెళ్ళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర చేయూతనిచ్చినట్టు కనిపిస్తోంది. శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభ కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ శ్రేణులంతా కదం తొక్కారు. పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలిరాగా... చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కార్యక్రమ నిర్వహణలో అంతా తానై వ్యవహరించారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల 'మేమంతా సిద్ధం' బహిరంగ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదిలిలో బిందువు బిందువు చేరి సిందువు అయినట్లు జనసంద్రం కనిపిస్తుందని.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ప్రతీ సిద్ధం అంటున్నారన్నారు. ప్రజల అజెండాతో మనం, జెండాలు జత కట్టి వాళ్లు వస్తున్నారని విమర్శించారు.
సెలవు రోజులు జలగండాలవుతున్నాయి. సరదాతో కొందరు, ప్రమాదవశాత్తు మరికొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆదివారం రోజున ఇద్దరు అన్నదమ్ములు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా సదుంలో చోటుచేసుకుంది.
గతంలో పొరుగు రాష్ట్రాలు చూడడానికి వెళ్లామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు మన ప్రభుత్వం వైపు చూసి వెళ్తున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట శిరికి రిసార్ట్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్.కోట మండల స్థాయి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిధిగా మంత్రి పాల్గొన్నారు.
వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె వద్దనే 2.5 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తి.. అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27 మహిళా అదృశ్యం కేసు నమోదు కాగా.. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.