పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్‌లో జైలు నుండి విడుదల అవుతారని ఆ పార్టీ కీలక నేత సర్దార్ లతీఫ్ ఖోసా వెల్లడించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధానికి విధించిన శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది, అయితే సైఫర్ కేసు ఒక వారం కూడా నిలబడదని ఖోసా ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు
రాష్ట్రానికి అన్యాయం చేసిందని కేంద్రాన్ని నిందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. రాష్ట్రానికి రావాల్సిన కరువు సహాయ నిధుల విడుదలలో జాప్యాన్ని అంగీకరించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ కన్నేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ 'అబ్ కీ బార్ 400 పార్' నినాదాన్ని ఇచ్చింది.
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఇవాళ ఏర్పడబోయే సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 9, 2024న తెల్లవారుజామున 2:22 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఉత్తర అమెరికాలోని ఎంచుకున్న ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని ఎదుర్కొంటాయి.
చిత్తూరు జిల్లా కమతంపల్లిలో దారుణం జరిగింది. పుంగనూరు మండలం కమతంపల్లిలో మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు గణేష్ అనే ఓ కామాంధుడు. ఈ క్రమంలో అవమానం తట్టుకోలేక మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.