ఈ పొత్తు సహితం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా భావిస్తున్నామని గన్నవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది.
పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు.
‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
కడియం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఆయనకు ఎలాగైన బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం నిలబడితే.. ఆయనకు పోటీగా తాటికొండ రాజయ్యను బరిలో దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేనెల జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలని ఆయన వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు.