Ponnam Prabhakar: ఏప్రిల్ 14న దీక్షకు దిగనున్న తెలంగాణ మంత్రి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ఆయన అన్నారు.
Read Also: Harish Rao: బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటే మియా.. రెండు అబద్దాల పార్టీలే..
Also Read
తెలంగాణా విభజననే తప్పు పట్టిన బీజేపీ ఓటు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా..?.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. మా గ్యారంటీల గురించి అడిగే బీజేపీ.. మోడీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని.. నిరుద్యోగుల గురించి ఏం చేశారని.. ప్రశ్నలు గుప్పించారు. మేము ఇద్దరం మాకు ఇద్దరు అన్నట్టు మోడీ, అమిత్ షా.. అదానీ, అంబానీకి దోచి పెట్టారని మంత్రి ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తుందన్నారు. మోడీ బొమ్మ మరిచిపోయారన్నారు. ఇంటింటికి రాముడు ఫోటో పెట్టి ఓట్లు అడుగుతున్నారన్నారు. ఏం చేశారో చెప్పకుండా.. రాముడి ఫోటోతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
మహాత్మా గాంధీ నుండే కాంగ్రెస్ రాముడిని కొలిచిందన్నారు. చేనేతల జీవితాల్లో బీజేపీ చీకటి నింపిందన్నారు. రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారని.. మీ హయాంలో25 రూపాయలు అయినా ఇచ్చావా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటై.. రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ అభ్యర్థిని తాము ఇంకా ప్రకటించనే లేదా.. హరీష్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని ఎలా అంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!