కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో రంజాన్ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు.. నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని వారితో కలిసి నమాజ్ చేశారు. ఈ సందర్భంగా.. పిల్లలతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.
గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం కచ్చితంగా స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం నగరంలోని ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.
పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం సొంత ప్రజలపైనే అకృత్యాలకు పాల్పడుతోంది. ఈసారి పాక్ ఆర్మీ క్రూరత్వానికి బలి అయినది మరెవరో కాదు.. సొంత దేశ పోలీసులే. పాకిస్థాన్ సైన్యం పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అక్కడ ఉంచిన పోలీసులను కొట్టి రక్తస్రావం చేసింది.