Telangana: రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. రంజాన్ పండుగ సందర్భంగా 4లక్షల 50 వేల మంది ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌కు ఇబ్బంది కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
Read Also: Harish Rao: బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటే మియా.. రెండు అబద్దాల పార్టీలే..
ప్రతి ఏడాది ప్రభుత్వం రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘానికి అభ్యర్థన చేసింది. పంపిణీ కోసం అనుమతి ఇవ్వాలని కోరింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీఈసీ అనుమతి ఇవ్వలేదు.