Laxman: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laxman: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు తడబడుతున్నారని.. వందరోజుల మా పాలనను రెఫరెండంగా భావించి మాకు ఓటు వేయాలని అన్నారని.. ఇప్పుడు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలపై వస్తున్న వ్యతిరేకత చూసి కాంగ్రెస్ మాట మారుస్తోందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని గ్యారెంటీలు నెరవేరుతాయని చెబుతున్నారని.. ఈ మాటలు వింటుంటే బోడగుండుకు మోకాలుకు ముడి పెట్టినట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
Read Also: Kavitha: రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ప్రజల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు తనపై కుట్ర జరుగుతోందని మాట్లాడుతున్నాడని.. సానుభూతి పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కూడా ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేనందున ఒవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ సిద్ధం అయిందని ఆయన ఆరోపించారు.ఇది స్వయంగా ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మాటల్లోనే చెప్పారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తరుపున తాను మాట్లాడుతుంటే తమ పార్టీకి నచ్చడం లేదని అంటున్నారని.. కానీ ఆ మాటలపై రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో మెసలడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. ప్రత్యర్థులకు తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చే రేవంత్ రెడ్డి ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్య ఎంఐఎం సంధి చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీని గెలవలేకే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో సారి మోడీనే ప్రధానిగా ఎన్నికోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలీ పోవాలని తాము కోరుకోవడం లేదని.. ఈ ఐదేళ్లు కాంగ్రెస్ మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమన్నారు. హామీల అమలు విషయంలో బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందన్నారు. అబద్ధాలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని.. అహంకారానికి నిర్వచనం బీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు