ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇది హేయమైన చర్య అని ఆమె ఖండించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అంటూ ఆమె తెలిపారు.
విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి విదితమేయ తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
సీఎం జగన్‌పై దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్కూల్ బిల్డింగ్ పైనుంచే జగన్‌పై దాడి జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఘటనాప్రాంతం సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్కూల్ భవనంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉండగా.. స్కూల్ బిల్డింగ్‌ను సీపీ కాంతి రాణా పరిశీలించారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య అని వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని భావిస్తున్నామని.. దీని వెనుక చంద్రబాబు ఉన్నాడని తన అనుమానమని ఆయన అన్నారు.
సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని.. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ వాళ్లు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా పడింది. తనకు అయిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ సీఎం జగన్‌కు వైద్యులు సూచనలు చేశారు.
పొన్నం.. మీ పార్టీ మాట తప్పినందుకు గాంధీభవన్ వద్ద దీక్ష చెయ్యి.. కేసీఆర్ 10 ఏళ్లపాటు అరిగోస పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చెయ్యి.. 80 కోట్ల మంది పేదలకు మోడీ అన్నం పెడుతున్నందుకు.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.