రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్‌కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులు కందగట్ల అనిల్-దేవి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్‌లో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్‌ఐఏ కీలక పురోగతి సాధించింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.
ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్‌పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు.
ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది.
రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.