చంచల్ గూడ జైలు అధికారులను ఖైదీ బురిడీ కొట్టించాడు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ అయిన సుజాయత్ అలీ నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైలు నుంచి పరారయ్యాడు. ల్యాండ్ గ్రాఫింగ్ కేసులో రెండు నెలల క్రితం సుజాయత్ అలీ అరెస్ట్ అయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి తెగబడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి మావోయిస్టులు హత్య చేశారు. మృతుడు భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కుమ్మేష్ కుంజమ్‌గా గుర్తించారు.
గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి రహదారులపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని.. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ వేశామని.. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని తెలిపారు. డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు […]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు,…
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం... అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్‌తో లబ్ధి పొందాయి.
దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్న ఆచార్య కొఠారి మాటలను ప్రజా ప్రభుత్వం ఆచరణలో చూపుతోంది.. నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విద్యా రంగంలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విప్లవాత్మకమైన చర్యలను చేపట్టింది. స్థానిక అవసరాలే కాకుండా ప్రపంచ అవసరాలను తీర్చే నైపుణ్యాలను తెలంగాణ బిడ్డలు ఒడిసిపట్టేలా సాంకేతిక విద్యకు కొత్త మెరుగులు దిద్దుతోంది.
కాంగ్రెస్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఆరు అబద్ధాలు-66 మోసాలు అంటూ బీజేపీ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని .. హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధ్యం అయ్యిందన్నారు.