ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఏర్పాటు చేశారు.
ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు ఏదో అన్నారని బాధతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరంలో చోటుచేసుకుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెలవులు, శని, ఆది, సోమ వారాల్లో అలంకార దర్శనం మాత్రమేనని ఆయన వెల్లడించారు.
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గాని అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేసి వెళ్ళిపోయింది. కనీస మానవత్వంతో ఆలోచించని ఆ తల్లి ప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చెత్తలో పడేసింది. మరో విధంగా ఆలోచిస్తే అమ్మ జాతికి మాయని మచ్చ తెచ్చే ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.
విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కిరెడ్డిపాలెంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా గుర్తించారు.
మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాలలో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారు. వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో యూట్యూబర్ పోస్ట్ చేశాడు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.