ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై ఫోకస్
ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా వేధింపులపై కేసులు, వాటి ప్రస్తుత భవిష్యత్తు కార్యాచరణపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్‌లపై కేబినెట్ చర్చించనుంది.
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. నాలుగు మృతదేహాలకు నేడు పోస్టుమార్టం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరణించిన నక్కలపల్లి రాములు, దామరగిద్ధ కృష్ణ, శ్యామల సుజాత, జమీల్ అనే నలుగురు మృదేహాలకు చేవెళ్ల టౌన్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేయనున్నారు. ఇక, ఈ ప్రమాదంలతో గాయపడిన ఆకుల పద్మమ్మ, బాలమణి, మోగులయ్యకి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోకరు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో, ఇంకో ఇద్దరు గాంధీ హస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. కాగా, చేవెళ్లలోని ఆలూరు రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అమీర్ ను చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. పాతబస్తీ చంద్రయన్ గుట్ట ప్రాంతానికి చెందిన అమీర్ కొంతకాలంగా లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. షాక్ నుంచి కోలుకోగానే లారీ డ్రైవర్ అమీర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న చేవెళ్ల పోలీసులు. ఇక, సంఘటన స్థలం నుంచి లారీ తొలగించి చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తుండగా ఆలూరు గేట్ సమీపంలో ముందు ఆగి ఉన్న బస్సును ఓవర్టేక్ చేసిన లారీ.. అనంతరం ఓ టీ స్టాల్ ఢీ కొట్టి కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకు వెళ్లింది. ఆలూరు గేట్ వద్ద కూరగాయాలు అమ్ముకుని ఉపాధి పొందుతున్న నాలుగు కుటుంబాల్లో లారీ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది.
ఏపీలో పుష్ప-2 టికెట్స్ ధరల వివరాలు ఇవే.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక షోస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేయనున్నారు. అందుకు అనుగుణంగా నైజాం లో అధిక ధరలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేలా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. ఇక ఏపీ లోను టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ ధరలు కాస్త తక్కువ అనే చెప్పాలి. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలతో పాటు డిసెంబరు 5న తెల్లవారుజామున 1 గంట షోకు పర్మిషన్ ఇచ్చారు,బెన్ఫిట్ షోస్ కు రూ.944 టికెట్ ధరను నిర్ణయించారు. ఇక రిలీజ్ డే నాడు టికెట్డ్ ధరను సింగిల్ స్క్రీన్ కు రూ. 297.50 అలాగే ముల్టీప్లెక్స్ లో రూ. 377 గాఫిక్స్ చేసార. మొదటి రోజు ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. ఇక రిలీజ్ రెండవ రోజు అనగా డిసెంబర్ 6వ తేదీ నుంచి 17 వరకు ఐదు షోస్ వేసుకునేలా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల డిసెంబరు 17 వరకూ పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. కాగా ప్రీమియర్స్ కు సంబందించిన బుకింగ్స్ ను నేడుఓపెన్ చేయనున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ లోను పుష్ప 2వేసేలా ఏర్పాట్లు చేసున్నారు. కాకుంటే వీలైనన్ని ప్రీమియర్స్ సింగిల స్క్రీన్స్ లో ప్రదర్శించేందుకు మొగ్గు చుపుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ముల్టీప్లెక్స్ లో లిమిటెడ్ షోస్ వేయాలని ఆలోచనలలో ఉన్నారని తెలుస్తోంది.
చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. పరిస్థితి విషమం
బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ రమణ్ రాయ్‌పై దాడి జరగడంపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) స్పందించింది. ఇస్కాన్ ప్రతినిధి రాధా రమణ్ దాస్ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థనలు చేయండిని కోరారు. అతను చేసిన ఒకే ఒక తప్పు చిన్మయ్ కృష్ణ కోసం న్యాయస్థానంలో వాదించడం.. ముస్లీంలు అతని ఇంటిని ధ్వంసం చేసి.. దాడి దారుణం.. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాటం చేస్తున్నారని రాసుకొచ్చారు. కాగా, బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు లాయర్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు అడ్వకేట్ హత్యకు గురయ్యాడంటూ గత నెలలో నెట్టింట కొన్ని వార్తా కథనాలు ప్రచారం చేశారు. అయితే, ఈ ప్రస్తావనలో వచ్చిన న్యాయవాది పేరు సైఫుల్ ఇస్లాం అని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆయన సర్కార్ తరపు లాయర్ అని.. అతను చిన్మోయ్ దాస్ కేసులో వాదించలేడని సమాచారం. బంగ్లాలోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ఇటీవల రంగ్‌పూర్‌లో హిందువులకు సపోర్టుగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేసి.. దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢాకా న్యాయస్థానం అతనికి బెయిల్ నిరాకరించింది. ఇక, బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుంచి మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. అలాగే, బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ ఆరోపించారు.
తమిళనాడులో విషాదం నింపిన ఫెంగల్ తుఫాన్.. 18 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్ తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో సోమవారం తమిళనాడులోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. కాగా, తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారడంతో.. నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూర్, దిండిగల్, కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక, తమిళనాడులో రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ఘోర విషాదం నింపింది. భారీ వర్షాల ధాటికి 18 మంది మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండ చరియలు విరిగిపడ్డాయి పలు ఇళ్లపై.. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. అందులో ఐదుగురు పిల్లలు సహా ఇద్దరు పెద్ద వారి మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇక, నిన్నటి (డిసెంబర్ 2) నుంచి కొండ చరియల కింద ధ్వంసమైన ఇళ్లల్లో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు అధికారులు. దాదాపు 27 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ చేసిన అధికారుల శ్రమకు ఫలితం దొరకలేదు. అలాగే, విల్లుపురంలో వర్షాలకు మరో 8 మంది మృత్యువాత పడ్డారు.
‘మాస్ జాతర’ను పరుగులు పెట్టిస్తున్న రవితేజ
విభిన్న చిత్రాలతో మాస్ మహారాజ్ రవితేజ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక దీపావళి శుభ సందర్భంగా రవితేజ 75వ చిత్రం టైటిల్ ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి “మాస్ జాతర” అనే టైటిల్ ను పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ క్రియేటివ్ గా ఉంది. జాతర సందడిలో, దీపావళి పండుగను తలపిస్తూ టపాసుల వెలుగుల నడుమ, తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ మాస్ మహారాజా అభిమానులతో పాటు, సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. “మాస్ జాతర” చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. “మాస్ జాతర” అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్లను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతోందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను 2025 మే 9న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
డిసెంబర్ 22న పీవీ సింధు పెళ్లి.. వరుడు ఎవరంటే?
రెండు ఒలింపిక్ పతకాల విజేత, ప్రపంచ మాజీ ఛాంపియన్ పీవీ సింధు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు. డిసెంబర్ 22న సింధు, సాయిల పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనుంది. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. డిసెంబర్ 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు ఆరంభం కానున్నాయి. పీవీ సింధు తండ్రి పీవీ రమణ మీడియాతో మాట్లాడుతూ… ‘మా రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అయితే గత నెలలోనే పెళ్లి ఖాయం చేసుకున్నాం. వచ్చే జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడబోతోంది. అందుకే డిసెంబరు 22న పెళ్లికి ముహూర్తం నిర్ణయించాం. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. 20 నుంచి పెళ్లి వేడుకలు మొదలు అవుతాయి’ అని చెప్పారు. 29 ఏళ్ల సింధుకు కాబోయే వరుడు వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. భారత గొప్ప అథ్లెట్లలో పీవీ సింధు ఒకరు. సింధు ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, రెండు ఒలింపిక్స్ పతకాలు గెలిచారు. రియో 2016, టోక్యో 2020లో ఒలింపిక్ పతకాలను సింధు గెలిచిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన సింధు.. 2017లో రజతం, 2018లో రజతం, 2013లో కాంస్యం, 2014లో కాంస్యం పతకాలు గెలిచారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. 2017లో కెరీర్ అత్యున్నత ప్రపంచ ర్యాంకింగ్ 2కు చేరుకున్నారు. రెండేళ్ల తర్వాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ట్రోఫీ 2024తో సుదీర్ఘ టైటిల్ నిరీక్షణకు సింధు తెరదించారు.
కన్ఫామ్.. పుష్ప 2 కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చింది దేవిశ్రీనే.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి భారీ స్థాయిలో నిర్వహించారు. భారీ జనసందోహం నడుమ జరిగిన ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ నుద్దేశిస్తూ ఈ సినిమా క్లైమాక్స్ కు ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అని అన్నారు. ఈ కామెంట్స్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ విషయం తెలుస్తోంది. ఇటీవల పుష్ప 2 సినిమాకు తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్ నాధ్ లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిరని రకరాలుకాగా వినిపించింది. కానీ తమన్ వర్క్ చేసిన పోర్షన్ సుకుమార్ కు నచ్చలేదని పక్కన పెట్టేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇక జాతర ఎపిసోడ్ కు సామ్ సీఎస్ చేసిన మ్యూజిక్ అద్భుతంగా అనే టాక్ కూడా నడిచింది. ఇప్పుడు సుకుమార్ చేసిన కామెంట్స్ తో వాళ్లెవరు కాదని దేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నే ఉంచినట్టు అర్ధం అవుతోంది. క్లైమాక్స్ పోర్షన్ దాదాపు 25 నిముషాలు సాగనుంది. మరి ఇతరులు చేసిన సంగీతాన్ని తీసుకున్నారా లేదా అనేది సినిమా రిలీజ్ అయితేగాని క్లారిటీ రాదు.
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..‘ది రాజా సాబ్’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్
ఈ ఏడాది ఇప్పటికే కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే మూవీ చేస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది. ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర న భూతో న భవిష్యత్ అనేలా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ చివరి నాటికి ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేయాలని.. క్రిస్మస్ కానుకగా ఈ చిత్ర టీజర్‌ను కూడా రిలీజ్ చేయాలని డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసం మారుతి తీవ్రంగా కష్టపడుతున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్‌తో ‘ది రాజా సాబ్’ సినిమాపై నెలకొన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.