ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్ట్) నుంచి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి బయలుదేరిన సీఎం జగన్.. ఇవాళ మధ్యాహ్నం లండన్ చేరుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ప్రమాదం జరిగింది. జి.కొండూరులోని పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ టైర్లు పేలి వాహనం పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో కలకోటి ప్రవీణ్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరును చేసింది. ముంబై ఎదుట 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ చెలరేగి ఆడాడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటైంది. సీఈసీ ఆదేశాలతో సిట్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ విచారణ జరపనుంది. 13 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రేపట్నుంచి(ఈ నెల 18) ఈ నెల 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్ఐసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలిసింది.
అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారంపై వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.
ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో విజయం సాధించి టోర్నీని ముగించాలని ప్రయత్నిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ చాలా కాలంగా ప్లేఆఫ్ రేసు నుండి దూరంగా ఉంది.
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం 66వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం కారణంగా అర్థరాత్రి వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేయడంతో ఇరు జట్లకు ఒక్కొక్క పాయింట్ లభించింది.