MI vs LSG: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరును చేసింది. ముంబై ఎదుట 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ చెలరేగి ఆడాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 75 పరుగులు చేశాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 55 పరుగులు చేశాడు. పూరన్, రాహుల్ అర్ధశతకాలు బాదడంతో లక్నో భారీ స్కోరు చేయగలిగింది. ముంబై బౌలర్లు మొదటి నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో లక్నో 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 49 పరుగులే చేయగలిగింది. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, పీయూష్ చావ్లాలు తలో మూడు వికెట్లు తీశారు.

ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో విజయం సాధించి టోర్నీని ముగించాలని ప్రయత్నిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ చాలా కాలంగా ప్లేఆఫ్ రేసు నుండి దూరంగా ఉంది. ముందు టాస్ గెలిచిన ముంబై.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ శుక్రవారం గెలిస్తే పది పాయింట్లు సాధించి చివరి స్థానంలో ఉండకుండా తప్పించుకోవచ్చు.