India vs Pakistan: ‘హ్యాండ్ షేక్’పై సూర్య సంచలన ప్రకటన.. పాక్ కండీషన్.. భారత్ ఒప్పుకుంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికొన్ని గంటల్లో మొదలవుతుంది. శ్రీలంకలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అనేక వివాదాల మధ్య ఈ మ్యాచ్ ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. మైదానంలో ఆట ఎంత ఉత్కంఠగా ఉంటుందో అనేది ఓ వైపు అయితే.. మ్యాచ్ ముందు లేదా ముగిసిన తర్వాత ఆటగాళ్లు చేతులు కలుపుతారా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
READ MORE: Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?
Also Read
మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆఘా “భారత్ ఏం చేస్తే దాని మీదే నిర్ణయం ఉంటుంది” అన్నాడు. సూర్యకుమార్ మాత్రం “24 గంటలు ఆగండి.. మైదానంలో ఏమవుతుందో చూస్తారు” అని నవ్వుతూ తప్పించుకున్నాడు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గతేడాది ఆసియా కప్‌లో రెండు జట్లు మూడు సార్లు ఎదురుపడ్డప్పుడు వాతావరణం చాలా టెన్షన్‌గా మారింది. ఆటగాళ్ల మధ్య మాటల ఏకంగా యుద్ధ వాతావరణం కొనసాగింది. మ్యాచ్ తర్వాత, ముందు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. కొందరు ఆటగాళ్లు ప్రేరేపించేలా సంకేతాలు సైతం చేశారు. ఆ సంఘటనల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని భారత్ ఫిక్స్ అయ్యింది. అయితే.. ఇటీవల తామే భారత్‌తో మ్యాచ్ ఆడమని మొండిగా ప్రవర్తించిన పాకిస్థాన్ ఐసీసీ భేటీ అనంతరం ఆడేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను పాక్ కండీషన్లు పెట్టింది. ఈ కండీషన్లలో భారత్ టీమ్ షేక్ హ్యాండ్ ఇవ్వాలనేది ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇంతకీ భారత్ షేక్ హ్యాండ్ ఇస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
READ MORE: Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!