ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం 3 జిల్లాల్లో జరిగిన హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది.
తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలో గల ‘కుర్తాళం’ జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు.
జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించవద్దంటూ ఆయన హితవు పలికారు.
అల్లర నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణమని ఆరోపించారు.
అప్పటివరకు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వారి గుండె ఆగినంత పనైంది. దుఃఖాన్ని దిగమింగి ఆ బాలుడిని భుజాన వేసుకొని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరిపోసేందేకు ప్రయత్నించింది.
ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు.
అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. ఇంటి అవసరాల కోసం తవ్విన నీటితొట్టె బాలుడి పాలిట యమపాశంగా మారింది.