రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
ప్రపంచ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 16న జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడం ప్రధాన లక్ష్యం ఈ వ్యాధిని నివారించడంతో పాటు దాని గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడం. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ అనేది దోమ కాటు వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి.
మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీటిలో అంబులెన్స్ ఆగిపోయింది. రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరగా.. అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇంజిన్‌లోకి నీరు చేరింది.
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు
హైదరాబాద్‌లోని ఇక్ఫాయి(ICFAI) యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. రంగు నీళ్లు అనుకుని తోటి విద్యార్థులే బకెట్‌లో ఉన్న యాసిడ్‌ను విద్యార్థినిపై పోసినట్లు తెలుస్తోంది
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.