Asaduddin Owaisi: “టిప్పు సుల్తాన్ ఎప్పుడూ ప్రేమలేఖలు రాయలేదు”.. మాలేగావ్ వివాదంపై ఓవైసీ..
- టిప్పు సుల్తాన్ ఎప్పుడూ బ్రిటీష్ వారికి ప్రేమ లేఖలు రాయలేదు..
- సావర్కన్‌ను ఉద్దేశిస్తూ ఓవైసీ కామెంట్స్..
- మహారాష్ట్రలో టిప్ప ఫోటో వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: మాలేగావ్‌లో ‘‘టిప్పు సుల్తాన్’’ ఫొటో వివాదం మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ ఫోటో ఉంచడం వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ సప్కల్ టిప్పు సుల్తాన్‌ను ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో పోల్చడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.
ఇదిలా ఉంటే, ఈ వివాదంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. టిప్పు సుల్తాన్‌ను ఓవైసీ అమరవీరుడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి మద్దతు తెలియజేశారు. సప్కల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. ఈ వివాదం గురించి ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారితో పోరాడుతూ అమరుడయ్యారు. వీర్ సావర్కర్ చేసినట్లు ఆయన బ్రిటిష్ వారికి ప్రేమ లేఖలు రాయలేదు. క్షమాపణలను కోరలేదు. టిప్పు సుల్తాన్ తన కత్తిని తీసుకుని బ్రిటీస్ వారి నుంచి తన దేశాన్ని విముక్తి చేయాలని పోరాడుతూ మరణించాడు. బ్రిటీష్ వీరికి టిప్పు ఎప్పుడూ భయపడలేదు. టిప్పు శరీరం గంటన్నర పాటు పడి ఉన్న, బ్రిటీష్ వారు అతడి వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేదు. టిప్పు వేలు నుంచి తొలగించిన ఉంగరంపై రామ్ అనే పదం ఉంది’’ అని అన్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
భారత్ వద్ద ఉన్న క్షిపణులు, రాకెట్ టెక్నాలజీ టిప్పు కలల్ని నిజం చేస్తున్నాయని అబ్దుల్ కలాం తన వింగ్ ఆఫ్ ఫైర్ లో రాశారు, ఇది అబద్ధమా..? అని ఓవైసీ ప్రశ్నించారు. మహాత్మా గాంధీ తన యంగ్ ఏజ్ మ్యాగజైన్‌లో టిప్పు సుల్తాన్ హిందూ-ముస్లిం ఐక్యతకు ఉదాహరణ అని రాశారు, దీనిని అబద్ధమని చెప్పగలరా? అని అడిగారు.
అంతకుముందు, కాంగ్రెస్ అధ్యక్షుడు సప్కల్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ ‘‘స్వరాజ్య’’ అనే ఆలోచన కోసం ఎలా ప్రయత్నించారో, బ్రిటీష్ వారిపై యుద్ధానికి టిప్పు సుల్తాన్ అలాగే పిలుపునిచ్చారని అన్నారు. టిప్పు పోరాటం శివాజీ మహరాజ్ ఆదర్శాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ ఒక యోధుడు, భారత పుత్రుడు అని అన్నారు. శివాజీతో సమానంగా టిప్పును మనం పరాక్రమానికి చిహ్నంగా చూడాలని అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!