MI vs LSG: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో విజయం సాధించి టోర్నీని ముగించాలని ప్రయత్నిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ చాలా కాలంగా ప్లేఆఫ్ రేసు నుండి దూరంగా ఉంది. అయితే లక్నో సూపర్ జెయింట్ తన చివరి మ్యాచ్‌లో 310 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ అది అసాధ్యం. లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ శుక్రవారం గెలిస్తే పది పాయింట్లు సాధించి చివరి స్థానంలో ఉండకుండా తప్పించుకోవచ్చు.
ముంబై ప్లేయింగ్ 11:
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (WK), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రూయిస్, హార్దిక్ పాండ్యా (c), నెహాల్ వధేరా, రొమారియో షెపర్డ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార.
లక్నో ప్లేయింగ్ 11:
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (డబ్ల్యూకే/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోనీ, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.