ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాస ఎయిర్ కు చెందిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఏడు విడుతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో కౌంటింగ్‌కు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు.
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 82, 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒడిశాలో గత మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించారు. ఒడిశా తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్ లో ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. పాక్ లో మెడికల్ కార్ప్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్ ర్యాంక్ సాధించిన క్రైస్తవ, మైనారిటీ కమ్యూనిటీ నుంచి మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి.
ఐరోపా దేశమైన పోర్చుగల్‌లో జరిగిన ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొనగా.. ఓ పైలట్ మృతి చెందారు. మరో విమానంలోని పైలట్ గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో కాల్పులు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్‌లో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి పోలీసులకు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు సోమవారం ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నేడు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో జూన్ 1న ఓటింగ్ నిర్వహించగా.. అ ఫిర్యాదులు రావడంతో మళ్లీ ఇక్కడ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.