48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sony Xperia 1 VIII Launched: టెక్ దిగ్గజం సోనీ (Sony) నుండి తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Sony Xperia 1 VIII ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, AI ఆధారిత కెమెరా టెక్నాలజీ, మంచి ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వచ్చింది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ ప్రియులను టార్గెట్ చేస్తూ సోనీ ఈ మోడల్‌ను రూపొందించింది.
Xperia 1 VIIIలో కొత్తగా “AI Camera Assistant” ఫీచర్‌ను అందించారు. Xperia Intelligence ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ ఫోటో తీసే సమయంలో సబ్జెక్ట్, వాతావరణ పరిస్థితులను గుర్తించి ఆటోమేటిక్‌గా సరైన సెట్టింగ్స్ సూచిస్తుంది. కలర్ టోన్, లెన్స్ ఎంపిక, బొకే ఎఫెక్ట్ వంటి అంశాలను AI ద్వారా మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్లో టెలిఫోటో కెమెరాకు పెద్ద 1/1.56-అంగుళాల సెన్సర్ ఇచ్చారు. గత మోడల్‌తో పోలిస్తే ఇది నాలుగు రెట్లు పెద్దదిగా ఉండటంతో దూరంలోని వస్తువులను మరింత క్లారిటీతో చిత్రీకరించవచ్చు. అలాగే 16mm, 24mm, 70mm ప్రధాన లెన్స్లన్నింటిలో RAW Multi-Frame Processing టెక్నాలజీ అందించారు. దీని వల్ల తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలు తీసుకోవచ్చని సోనీ చెబుతోంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ప్రీమియం డిజైన్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కొనసాగించారు. ఈ ఫోన్లో “ORE Design” ఉపయోగించారు. ప్రకృతిలోని రత్నాల నుంచి ప్రేరణ పొందిన టెక్స్చర్ డిజైన్‌తో ఫోన్‌కు ప్రత్యేక లుక్ ఇచ్చారు. ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, సిల్వర్, గార్నెట్ రెడ్, నేటివ్ గోల్డ్ రంగుల ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి ఫ్లాగ్షిప్ ఫోన్లలో కనిపించని 3.5mm ఆడియో జాక్, ప్రత్యేక కెమెరా షట్టర్ బటన్‌ను సోనీ ఈ మోడల్లో కొనసాగించింది. అలాగే కొత్త ఫుల్-స్టేజ్ స్టీరియో స్పీకర్స్ ద్వారా మరింత మంచి బాస్, క్లియర్ ఆడియో అనుభవం లభిస్తుందని కంపెనీ తెలిపింది.
Xperia 1 VIIIలో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గత తరంతో పోలిస్తే 20% మెరుగైన పనితీరు అందిస్తుందని సోనీ వెల్లడించింది. గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్‌లో ఈ ఫోన్ వేగంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని సోనీ పేర్కొంది. అంతేకాకుండా బ్యాటరీ హెల్త్‌ను నాలుగు సంవత్సరాల వరకు మెరుగ్గా ఉంచే టెక్నాలజీని కూడా అందించారు.

Sony Xperia 1 VIII స్పెసిఫికేషన్లు:
* 6.5-అంగుళాల FHD+ OLED HDR డిస్ప్లే
* 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్
* Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్
* 12GB / 16GB RAM
* 256GB నుంచి 1TB వరకు స్టోరేజ్
* 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
* 12MP ఫ్రంట్ కెమెరా
* Android 14, IPX8 వాటర్ రెసిస్టెన్స్
* 30W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
Xperia 1 VIII ప్రీ-ఆర్డర్లు మే 13 నుంచి మొదలు కానున్నాయి. ఇక ధర విషయానికి వస్తే.. 256GB స్టాండర్డ్ వెర్షన్ ధర సుమారు €1499 (రూ.1,68,300) కాగా, 1TB ప్రత్యేక నేటివ్ గోల్డ్ ఎడిషన్ ధర €1999 (రూ. 2,24,440) గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్ చేసే వారికి Sony WH-1000XM6 హెడ్ఫోన్లు ఉచితంగా అందించనున్నట్లు సోనీ ప్రకటించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!