అభిమాన ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న సరికొత్త కథా కథనాల వినూత్న ధారావాహిక "నిన్ను కోరి". జూన్ 3 నుంచి.. మధ్యాహ్నం 12. 30 గంటలకు స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. తప్పక చూడండి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు అయిందని.. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని అన్నారు.
ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు వేరని.. మాకు ప్రజలపై అపారమైన నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్‌తో సంబంధం లేదని.. 36 గంటలు ఆగితే కరెక్ట్ రిజల్ట్ వస్తుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు... క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి.
వారసుడు కావాలి అని అత్తింటి వారు వేధింపులు తాళలేక గర్భిణీ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పెనమలూరు మండలం రామలింగేశ్వర నగర్‌కు చెందిన చందు కావ్య శ్రీ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. కొన ఊపిరితో ఉన్న కావ్యశ్రీని కామినేని హాస్పిటల్‌కు భర్త, తల్లిదండ్రులు తరలించగా చికిత్స పొందుతూ కావ్యశ్రీ మృతి చెందింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మోసగాడు పదేళ్లు తెలంగాణ పరిపాలించాడని తీవ్రంగా విమర్శించారు. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే.. జిన్నా ఆగస్టు 14న వేడుకలు చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా అట్లనే జూన్ 1 నుండి వేడుకలు చేస్తున్నాడన్నారు.
కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.