CEC Rajiv Kumar: రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఏడు విడుతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో కౌంటింగ్‌కు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నో రికార్డులు సృష్టించారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఈసారి మహిళలు కూడా అధిక సంఖ్యలో ఓటు వేసినట్లు సీఈసీ తెలిపింది. ఈ సారి ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 31 కోట్ల 20 లక్షల మంది మహిళలు సహా 64 కోట్ల 20 లక్షల మంది ఓటర్లు పాల్గొని భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని సీఈసీ పేర్కొంది. ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం స్టాండింగ్ అవేషన్ ఇచ్చింది. మనదేశం ఓటేసిన వారి సంఖ్య.. జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు అని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. రూ.10 వేల కోట్ల నగదును సీజ్ చేశామన్నారు.
Read Also: DGP Harish Kumar Gupta: సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు.. డీజీపీ సీరియస్ వార్నింగ్
ఎన్నికల సిబ్బంది అద్భుతంగా పని చేయడం వల్ల ఈసారి తక్కువ రీపోలింగ్ జరిగిందని సీఈసీ పేర్కొంది. మేము 2024 లోక్‌సభ ఎన్నికలలో 39 రీపోల్స్ మాత్రమే చూశామని, అయితే 2019 లో 540 రీపోల్స్ వచ్చాయని సీఈసీ పేర్కొన్నారు. 39 రీపోలింగ్ లలో 25 రీపోల్స్ కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే జరిగాయన్నారు. లోక్‌సభ ఎన్నికలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. హింసను చూడని సార్వత్రిక ఎన్నికలలో ఇదొకటి అని అన్నారు. దీనికి రెండేళ్ల సన్నద్ధత అవసరమన్నారు. కౌంటింగ్‌కు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు సీఈసీ తెలిపింది.