Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- ఉత్తరప్రదేశ్‌లో తుఫాను బీభత్సం
- 100 మంది మృతి.. పలువురికి గాయాలు
- మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం
- యూపీ తుఫాన్ మృతులకు పుతిన్ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్.. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు సంతాపం సందేశం పంపించారు. ఉత్తరప్రదేశ్‌లో తుఫాను వల్ల జరిగిన ప్రాణ నష్టంపై పుతిన్ విచారం వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ములకు సందేశం పంపారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ప్రియమైన వారికి నా ప్రగాఢ సంతాపం. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..’’ అని రాసుకొచ్చారు.
బుధవారం ఉత్తరప్రదేశ్‌లో తుఫాను బీభత్సం సృష్టించింది. సుమారు 19 జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. 100 మందికి పైగా మరణించారు. బుధవారం ఊహించని రీతిలో రాష్ట్రమంతటా తుఫాన్ కకావికలం చేసింది. పెద్ద ఎత్తున గాలులు, వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్థం అయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 21 మంది మృతి చెందారు.
Also Read
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
భదోహిలో 18 మంది, మీర్జాపూర్లో 15 మంది, ఫతేపూర్‌లో 10 మంది, ఉన్నావ్, బదాయూన్‌లలో చెరో ఆరుగురు, ప్రతాప్‌గఢ్, బరేలీలలో చెరో నలుగురు, అలాగే సీతాపూర్, రాయ్‌బరేలి, చందౌలీలలో ఇద్దరు చొప్పున మరణించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఆర్థిక సాయాన్ని పంపణీ చేయాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఐదారు జిల్లాల్లో హోరుగాలి, వర్షం బీభత్సం సృష్టించింది. హోర్డింగులు, రేకుల షెడ్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరియాయి. ఒక వ్యక్తి అయితే గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


తాజావార్తలు
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?